శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2019 (15:23 IST)

మధుమేహం ఉన్నవారు పండ్లు తినాలా? వద్దా?

మధుమేహం ఉన్నవారు పండ్లు తినాలా? వద్దా? అసలు నోటికి తీపి తగలకూడదని అంటారు. స్వీట్స్, తీయని పండ్లు మానెయ్యాలని అంటారు. కొందరేమో పండ్లు తినాలంటారు. అసలు ఏది కరెక్ట్? ఏ పండ్లు తీసుకోవాలి? 
 
నిజానికి పండ్లు నేచురల్ హీలర్స్. వీటిలోని అనేకానేక పోషకాలు ఆరోగ్యాన్నిస్తాయి. ఫైబర్, విటమిన్ బి, సి, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మధుమేహం ఉన్నవారు తప్పనిసరిగా పండ్లు తీసుకోవాలి. వీటిలోని షుగర్ వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుందని భయపడనవసరం లేదు. 
 
2-4 పోర్షన్ సైజు పండ్లు రోజు మొత్తంలో తీసుకోవచ్చు. పండ్లును భోజనంతో పాటు లేదా స్నాక్స్‌లాగా తీసుకోవచ్చు. ఒక పోర్షన్ అంటే ఒక మీడియం ఆపిల్ సైజు అన్నమాట.
 
ఏ పండు ఎంత తీసుకోవాలి?
మీడియం సైజు ఆపిల్, ఆరెంజ్, బత్తాయి, పీర్, జామ.
 
ఆల్‌బుఖరా-5, ద్రాక్ష-ఒక కప్పు, స్ట్రాబెర్రీలు- ఒక కప్పు, బొప్పాయి- రెండు కప్పులు. 

బాగా తియ్యని పండ్లయితే... అరటి పండు- చిన్నది, మామిడికాయ- 3 ముక్కలు, పుచ్చకాయ- 2 ముక్కలు, తర్బూజా- 2 పెద్ద ముక్కలు, సీతాఫలం- మీడియం సైజు, ఫైనాపిల్- 3 ముక్కలు.
 
ఎప్పుడు తినాలి?
ఉదయం అల్పాహారంతో ఒక పోర్షన్
మిడ్ మార్నింగ్ స్నాక్స్‌లో ఒక పోర్షన్
సాయంత్రం స్నాక్స్‌లో ఒక పోర్షన్ తీసుకుంటే రోజుకు కావాల్సిన పండు తిన్నట్టే.