బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 ఆగస్టు 2021 (09:27 IST)

విటమిన్లు వాడుతున్నారా?.. అయితే ఒక్క నిముషం!

విటమిన్ల లోపం వల్ల శరీరానికి ఆరోగ్య సమస్యలు తలెత్తితే, ఎక్కువ విటమిన్లు తీసుకోవడం వలన కూడా అంతే సమస్య ఎదురౌతుంది. ఒకోసారి ప్రాణాంతకం కూడాను.
 
విటమిను 'ఎ' ని మరీ ఎక్కువగా తీసుకుంటే ఎముకలు పెళుసెక్కడం, కాలేయం, ప్లీహం పెద్దవి కావడం, ఆకలి మందగించడం మొదలైనవి కలుగుతాయి.
 
'డి' విటమిను ఎక్కువగా తీసుకుంటే వాంతులు, తలనొప్పి, బరువు తగ్గడం, కాల్షియం కిడ్నీలలోను, ధమనులలోను చేరిపోవడం జరుగుతుంది. మనం తినే ఆహారంలో విటమిన్లు ఎక్కువ వాడడం అనేది జరగదు. ఎందుకంటే
 
సాధారణంగా మన ఆహారంలో విటమిన్లు తారతమ్యాన్ని బట్టి తక్కువగానే ఉంటాయి. కొన్నింటిలో ఈ విటమిన్లు చాలా హెచ్చుగా ఉంటాయి.

ఉదా:- ఎ, డి, కె విటమిన్లు చాలా హెచ్చుగా ఉండేవి. 1. కాడ్వర్ ఆయిల్ 2. ఎర్రపామాయిలు 3. ధ్రువపు ఎలుగుబంటి లివరు. కానీ వీటిని మనం దాదాపుగా ఉపయోగించం అయినా.... ఈ క్రింది మార్గదర్శక సూత్రాలను పాటిస్తే మంచిది : విటమిన్లు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే వాడాలి.
 
* మోతాదు మించితే విటమిన్ల వలన ప్రాణాంతకమైన సమస్యలు కూడా తలెత్తవచ్చు.
* కొంచెం తక్కువయినా పరవాలేదు కాని, మరీ ఎక్కువయితే మాత్రం ఇవి ప్రమాదాన్ని కలిగిస్తాయి.
*సహజంగా ఆహారం లో దొరికే విటమిన్- వలన ఈ ప్రమాదం వుండదు విటమిన్ల లోపం అని చెప్పి ప్రత్యేకంగా విటమిన్ టాబ్లెట్స్ వాడే వారికే ప్రమాదమంతా. కాబట్టి వారు చాలా జాగ్రత్తగా లెక్కవేసుకుని ఈ టాబ్లె పరిమిత కాలానికి మాత్రం వాడడం మంచిది.
*కరో నా సమస్య వచ్చినప్పుడు నుండి చాలా మంది క్యాల్షియం టాబ్లెట్ లు విటమిన్ టాబ్లెట్స్
ముఖ్యంగా సి విటమిన్ డి విటమిన్ టాబ్లెట్ విరివిగా వాడుతున్నారు  డాక్టర్నుసంప్రదించకుండా...
న్యూస్ పేపర్లలో, టీవీలలో, యూట్యూబ్ లో చూసి విటమిన్ టాబ్లెట్ లు అధికంగా వాడుతున్నారు.
* చాలామంది  రూం కే పరిమితమై బయట ప్రపంచాన్ని చూడకుండా సూర్యరశ్మిలో తిరగకుండా, శరీరం మీద కిరణాలు పడుకుంటే "డి"
విటమన్లు ఎక్కడి నుంచి వస్తాయి ?
పాల ఉత్పత్తుల్లో ను పండ్లు కూరగాయలు లోనూ డి విటమిన్ చాలా తక్కువగా ఉంటుంది
*సి విటమిన్ లభించాలంటే:---
పచ్చటి ఆకుకూరలు పుల్లటి పళ్ళు
నిమ్మ బత్తాయి ఆరెంజ్ మొదలగు నవి. ఎండిన పెద్ద ద్రాక్ష జామ పండు మామిడి బొప్పాయి, స్ట్రాబెరీ...
వీటిలో విరివిగా లభిస్తుంది
అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన ఒక సర్క్యులర్ లో" సింథసైజడ్"
విటమిను లు వాడడం ప్రమాదకరమని ప్రకటించింది మెడికల్ కౌంటర్లలో వాటిని అమ్మడం నేరమని ప్రకటించారు.
కాని భారతదేశంలో అలాంటి పట్టింపులు లేవు.