శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 27 మార్చి 2019 (18:31 IST)

ఉదయాన్నే పరగడుపున క్యాలీఫ్లవర్ జ్యూస్ తాగితే?

అన్ని కాలాలలో లభించే కూరగాయలలో క్యాలీఫ్లవర్  కూడా ఒకటి. ఇది చలికాలంలో మరింత ఎక్కువగా దొరుకుతుంది. ధరలు కూడా చౌకగానే ఉంటాయి. గోబిపువ్వుగా పిలవబడే ఈ కూరగాయలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్యాలీఫ్లవర్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
క్యాలీఫ్లవర్ శరీరానికి చలువ చేస్తుంది. శరీరంలో ఉష్ణాన్ని తగ్గించి వేడి చేయకుండా చూస్తుంది. గోబిపువ్వును తినడం వల్ల జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. తిన్న ఆహారం త్వరగా అరుగుతుంది. దీని ఆకులను సలాడ్‌ల రూపంలో తీసుకోవచ్చు. దీనిని తింటే రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడి వ్యాధులు త్వరగా నయం అవుతాయి. ప్రతి రోజూ 50 గ్రాముల క్యాలీఫ్లవర్ ఆకులు తింటే దంత సమస్యలు రాకుండా ఉంటాయి. 
 
చిగుళ్లు, దంతాలు పటిష్టంగా మారతాయి. కేశాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. ఒత్తుగా పెరుగుతుంది. క్యాన్సర్‌తో బాధపడేవారు ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున క్యాలీఫ్లవర్ జ్యూస్ తాగితే తప్పకుండా ఉపశమనం పొందవచ్చు. మలినాలను బయటకు నెట్టి జీర్ణాశయాన్ని, పేగులను శుభ్రం చేస్తుంది. శరీరానికి గాయం తగిలితే క్యాలీఫ్లవర్ ఆకుల రసం రాస్తే త్వరగా మానిపోతుంది. పుండ్లు కూడా మాయమవుతాయి.