సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (20:43 IST)

లాక్ డౌన్.. సూర్యుడికి గుడ్ మార్నింగ్ చెప్పేయండి.. 15 నిమిషాలు..?

కరోనాతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వ్యాయామానికి పెద్ద పీట వేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సూర్యోదయానికి ముందే నిద్రలేవాలని చెప్తున్నారు. ఉద్యోగాల కోసం వెళ్తూ హడావుడిగా పరుగులు తీసే పని లేకపోవడం వల్ల.. సూర్యునికి తప్పకుండా గుడ్ మార్నింగ్ చెప్పాలని వైద్యులు చెప్తున్నారు.

ప్రతిరోజూ కనీసం 15 నిమిషాలు సూర్యుని ముందు కూర్చోవడం చేయాలి. లేకుంటే సన్ బాత్ చేయాలి. ఇలా చేస్తే కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. రోజూ ఇలా చేయడం ద్వారా ముఖానికి సంబంధించిన చర్మ సమస్యలుండవు. పచ్చ కామెర్లు తొలగిపోతాయి. చర్మ వ్యాధులు దరిచేరవు. అలాగే పిల్లలు, పెద్దలు రోజూ సూర్యుని ముందు 15 నిమిషాలు నిలిస్తే.. డి విటమిన్ చేకూరుతుంది.

క్యాన్సర్ కారకాలు దూరమవుతాయి. ఇన్సులిన్ ఉత్పత్తిలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం వుంటే ఇన్సులిన్ ఉత్పత్తిలో ఇబ్బంది ఏర్పడుతుంది. తద్వారా టైప్-2 మధుమేహం ఏర్పడే అవకాశం వుంది. అందుకే మధుమేహాన్ని దూరం చేసుకోవాలంటే.. సూర్య కిరణాలు శరీరంపై పడాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కంటి దృష్టి లోపాలు తొలగిపోతాయి. ఎముకలకు బలం చేకూరుతుందని వారు సెలవిస్తున్నారు.