ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 13 డిశెంబరు 2022 (23:47 IST)

జాజికాయ ఆరోగ్య రహస్యాలు ఏంటవి?

జాజికాయ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవేస్తుంది. జాజికాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
జాజికాయ పొడికి తేనె కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి స్క్రబ్‌ వేసుకుంటే కాంతులీనుతారు.
 
తాంబూలంలో జాజికాయను వేసుకుని సేవిస్తే నోటి దుర్వాసన పోతుంది.
 
పాలలో జాజికాయ పొడిని కలుపుని తాగితే గుండెల్లో నొప్పి, దడ తగ్గుతాయి.
 
గోరువెచ్చని పాలల్లో కొద్దిగా జాజికాయ పొడిని కలుపుకుని తాగితే చర్మం ముడతలు పడవు.
 
జాజికాయ అధిక దాహాన్ని అరికట్టడమే కాకుండా అలసటవల్ల వచ్చిన జ్వరాన్ని తగ్గిస్తుంది.
 
మనస్సులోని ఆవేశాన్ని, ఆగ్రహాన్ని, ఉద్రేకాన్ని తగ్గించి మనస్సు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.
 
సాయంత్రం పూట గోరువెచ్చని ఆవుపాలతో జాజికాయ పొడిని పురుషులు కలిపి తాగితే శక్తినిస్తుంది.
 
జాజికాయను తీసుకుంటే దగ్గు, జలుబు, కఫానికి ఔషధంగా పనిచేస్తుంది. 
 
మోతాదుకు మించి జాజికాయను ఉపయోగించడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చు.
 
అధికంగా వాడితే ఏకాగ్రత కోల్పోవడం, ఎక్కువ చెమట పట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
 
జాజికాయ వాడకం విషయంలో జాగ్రత్త వహించడం ముఖ్యం, గర్భవతులు దీన్ని ఉపయోగించకూడదు.
 
చిట్కాలు ఆచరించే ముందు వైద్యుడిని సంప్రదించాలి.