కాకర గుజ్జుతో చుండ్రు తొలగిపోతుందా? ఎలా?

Bitter Gourd
Bitter gourd Health Benefits
సెల్వి| Last Updated: ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (15:43 IST)
కాకరకాయను వారానికి రెండుసార్లైనా ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్ వంటివి దరిచేరవు. కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారు. కాకర రసం తాగితే మంచి ఫలితం ఉంటుంది. కాకరలో ఉండే విటమిన్ సి, మెగ్నీషియం, పొటాసియం, జింక్, ఐరన్ వంటి పోషకాలు ఉన్నాయి. కాకరలోఉండే సి, ఏ, జింక్ విటమిన్ల వల్ల చర్మానికి మెరుపు వస్తుంది.

జుట్టుకు కాకర గుజ్జును రాయడం చుండ్రు సమస్య తగ్గి జుట్టు నిగనిగలాడుతుంది. మద్యానికి బానిసలైన వారు కాకర రసం తీసుకోవడం వల్ల లివర్‌ సమస్యలను అధిగమించవచ్చు. అలాగే మహిళలు ఈ రసం తాగడం వల్ల గర్భశయ, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. కానీ గర్బిణీ స్త్రీలు, బాలింతలు తీసుకోకపోవడం మంచిది.

కాకర రసం తాగడం ద్వారా మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. కాకర రసాన్ని తీసుకుంటే అధిక బరువు సమస్య వుండదు. శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. ఇక రక్తపోటు, హైబీపీ, అలర్జీల సమస్యలు అస్సలు దరిచేరవు. మరీ ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కంటిచూపుకు, కాలేయానికి కాకర ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :