శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 మే 2020 (16:16 IST)

సొరకాయను వేసవిలో తీసుకుంటే? (video)

సొరకాయను వేసవిలో వాడటం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో సోడియం చాలా తక్కువగా ఉండటం వల్ల అధిక రక్తపోటు, హృదయ సంబంధ సమస్యలతో బాధపడేవాళ్లకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. పిండి పదార్థాలు ఇందులో వుండటం ద్వారా మధుమేహాన్ని దూరం చేస్తాయి.  సొరకాయను తీసుకోవడం ద్వారా రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సాయపడుతుంది.
 
సొరకాయలో ఎక్కువగా ఉండే విటమిన్‌-సి చర్మానికి నిగారింపును ఇస్తుంది. అసిడిటీని దూరం చేస్తుంది. సొరకాయ రసాన్ని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. కప్పు సొరకాయ తురుములో సుమారు పదిహేడు కేలొరీలు మాత్రమే ఉంటాయి. 
 
కాబట్టి అధిక బరువుతో బాధపడేవాళ్లు నిరభ్యంతరంగా దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. దీంట్లో ఉండే 90 శాతం నీరు అధిక దాహాన్ని, వేడిని తగ్గిస్తుంది. కాబట్టి వేసవిలో ఈ జ్యూస్‌ను తాగొచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.