సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (15:48 IST)

క్యాబేజీ రసాన్ని భోజనానికి ముందు తీసుకుంటే..?

క్యాబేజీ రసాన్ని భోజనానికి ముందు తీసుకుంటే.. అల్సర్ దూరమవుతుంది. అలాగే పచ్చి క్యాబేజీ రసానికి అంతే మోతాదులో క్యారెట్ రసం తీసుకుంటే పెప్టిక్ అల్సర్ మాయమవుతుంది. మూడు మాసాల పాటు ఉదయం అల్పాహారానికి ముందు

క్యాబేజీ రసాన్ని భోజనానికి ముందు తీసుకుంటే.. అల్సర్ దూరమవుతుంది. అలాగే పచ్చి క్యాబేజీ రసానికి అంతే మోతాదులో క్యారెట్ రసం తీసుకుంటే పెప్టిక్ అల్సర్ మాయమవుతుంది. మూడు మాసాల పాటు ఉదయం అల్పాహారానికి ముందు పచ్చి క్యాబేజీ సలాడ్ తీసుకుంటే శరీరం బరువు తగ్గిపోతుంది. 


ఇతర ఆహార పదార్థాలతో పాటు క్యాబేజ్‌ను కూడా తీసుకుంటే, వృద్దుల్లో రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది. కొన్ని క్యాబేజ్‌ రెమ్మల్ని దంచి, తెల్లని బట్టలో చుట్టి నిద్రా సమయంలో తలకు కడితే మైగ్రేన్‌ తగ్గుతుంది. ఇందుకు తాజా రెమ్మల్ని మాత్రమే వాడాలి. 
 
మోకాళ్ల నొప్పులు, అధిక శ్రమ ద్వారా కలిగే నొప్పులను తగ్గించడంలో క్యాబేజీ ఆకులు సమర్థవంతంగా పనిచేస్తాయి. తలనొప్పిని తగ్గించడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి. శరీరంలోని వ్యర్థపదార్థాలను బయటికి పంపించడంలో క్యాబేజీ బాగా పనిచేస్తుంది. తరచూ క్యాబేజీని తీసుకుంటే శరీర పనితీరు మెరుగవుతుంది. క్యాబేజీలో సల్ఫర్ సమృద్ధిగా ఉంటుంది. 
 
ఇది చర్మానికి అందాన్నిస్తుంది. వెంట్రుకలను సంరక్షిస్తుంది. పలు రకాల క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు క్యాబేజీలో ఉన్నాయి. క్యాబేజీ రక్తపోటును నియంత్రిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజీ బాగా ఉపయోగపడుతుంది. పచ్చి క్యాబేజీ జ్యూస్ తాగితే ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. క్యాబేజీని తరచుగా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా దంతాలు మెరిసిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.