శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 ఫిబ్రవరి 2020 (12:22 IST)

పైల్స్‌కు దివ్యౌషధం సపోటా.. బరువు తగ్గాలంటే?

సపోటాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సపోటా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది. సపోటా పండు శరీరంలోని వేడి తగ్గించి చలవనిస్తుంది. పొడి దగ్గును దూరం చేస్తుంది. మొలలు, ఫిస్టులా వంటి వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. పైల్స్‌తో భాద పడేవారికి రక్తస్రావాన్ని ఆపుతుంది. పొట్టలో పుండ్లు, వాపు, నొప్పి,మంటలను తగ్గిస్తుంది.
 
సపోటా నరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రలేమితో, ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తులకు సపోటా చాలా మంచిది. దీనిలో అధికంగా ఉండే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరచేందుకు దోహదం చేస్తుంది. పిండిపదార్థాలు, అవసరమైన ఇతర పోషకాలు సపోటాలో అధిక మోతాదులో ఉండటం వల్ల గర్భిణీలకు, బాలింతలకు చాలా ఉపయోగకరం.
 
సపోటా పండులో యాంటీ-ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడం వల్ల ముడతలను తగ్గించడంలో ప్రభావాన్ని చూపిస్తుంది. సపోటా పండు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్ ఎంజైమ్ స్రావాన్ని నియంత్రించడం ద్వారా ఊబకాయాన్ని నిరోధిస్తుంది. తద్వారా జీవక్రియను నియంత్రిస్తుంది.

సపోటాలు మూత్రపిండాల్లో రాళ్ళను తొలగించడానికి సహాయపడి, మూత్రవిసర్జన కారకాలుగా పనిచేస్తాయి. అలాగే ఇవి మూత్రపిండాల వ్యాధుల నుండి రక్షణను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.