అమ్మో కారం అంటూ వాటిని పక్కనబెట్టేస్తున్నారా..?

chillies
chillies
సెల్వి| Last Updated: బుధవారం, 28 అక్టోబరు 2020 (19:26 IST)
మిరపకాయల్ని అమ్మో కారం అంటూ పక్కనబెట్టేస్తున్నారా..? అయితే ఈ కథనం చదవాల్సిందే. మిరపకాయలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు వుండవని తాజా పరిశోధనలో వెల్లడి అయ్యింది. అందుచేత రోజుకు రెండేసి మూడేసి మిరపకాయలను వంటల్లో తప్పక చేర్చుకోవాలని వారు సూచిస్తున్నారు.

మిరపకాయల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గించే క్యాప్‌సేసియన్‌ అనే పదార్థం ఉంటుందని.. తద్వారా గుండెకు రక్షణ కలుగుతుందని పరిశోధకులు చెప్తున్నారు. అందుకే మనం తీసుకునే ఆహారంలో వారానికి నాలుగు లేదా ఐదు సార్లైనా మిరపకాయలను డైట్‌లో చేర్చుకోవాలి. వీటిని తీసుకుంటే.. గుండె పోటు ముప్పు 40 శాతం తగ్గుతుందని పరిశోధకులు చెప్తున్నారు.దీనిపై మరింత చదవండి :