గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 డిశెంబరు 2022 (16:33 IST)

కొబ్బరి పువ్వుతో ఆరోగ్యం.. మధుమేహం పరార్..

coconut flower
coconut flower
కొబ్బరి పువ్వును ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. కొబ్బరి, కొబ్బరి నీళ్ల కంటే కొబ్బరి పువ్వులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 
 
అలాగే సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి కొబ్బరి పువ్వు పూర్తి రక్షణను అందిస్తుంది. కొబ్బరి పువ్వు ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది. ఇది రక్తంలో అదనపు చక్కెరను నియంత్రిస్తుంది. ఇది గుండెలో కొవ్వు నిల్వలను కరిగిస్తుంది. 
 
రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. గుండె జబ్బుల నుండి కాపాడుతుంది. ఒత్తిడి లేదా పని కారణంగా తినలేనప్పుడు, కొబ్బరి పువ్వు మాత్రం తీసుకుంటే పూర్తి శక్తిని ఇస్తుంది.
 
జీర్ణ శక్తి బలహీనంగా ఉంటే కొబ్బరి పువ్వు గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. ఇందులోని ప్రొటీన్లు, విటమిన్లు పేగులను రక్షిస్తాయి. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. థైరాయిడ్ సమస్యలను సరిచేస్తుంది. థైరాయిడ్ స్రావాన్ని నియంత్రిస్తుంది.
 
కొబ్బరి పువ్వు ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడం ద్వారా కణాలను రక్షిస్తుంది. క్యాన్సర్‌ను నివారిస్తుంది. కొబ్బరి కిడ్నీ డ్యామేజ్ తగ్గిస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది. టాక్సిన్స్‌ను బయటకు పంపి కిడ్నీలను రక్షిస్తుంది. శరీర బరువును నియంత్రిస్తుంది.
 
ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. జీవక్రియను ప్రేరేపించడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా త్వరగా బరువు తగ్గుతుంది. ఇందులో యాంటీ ఏజింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ముడతలు, వృద్ధాప్యం, చర్మం కుంగిపోవడం మొదలైన వాటిని నివారిస్తుంది. ఎండ వల్ల చర్మం దెబ్బతినకుండా చేస్తుంది.
 
యోగా, శ్వాస వ్యాయామాలు, వాకింగ్ చేయడం వల్ల మన హెచ్‌డిపి స్థాయిలు పెరుగుతాయి. అయితే, కొబ్బరి పువ్వులు తినడం ద్వారా 10 కిలోమీటర్లు నడిచినంత ప్రభావం పొందవచ్చు.
 
కొబ్బరి పువ్వులో రాగి, ఇనుము, జింక్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల, ఇది ఎర్ర కణాల సంఖ్యను పెంచుతుంది. కొవ్వు ఆమ్లం (ఫ్యాటియాసిడ్) తక్కువగా ఉంటుంది. అందుకే మంచి కొలెస్ట్రాల్ మన శరీరానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.