మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 30 నవంబరు 2022 (22:03 IST)

గుల్కంద్ తింటే ఏంటి లాభం?

Gulkand
గుల్కంద్ అంటే ఏమిటి, దానిని తినడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాము. తాజా గులాబీ రేకుల్లో చక్కెర మిఠాయిని మిక్స్ చేసి గాజు పాత్రలో ఉంచండి. కొంత సమయం తరువాత అది గుల్కంద్ అవుతుంది.
 
శరీరంలో వేడి పెరిగినప్పుడు గుల్కంద్ తింటారు. ఇది అవయవాలకు చల్లదనాన్ని అందిస్తుంది. ఉదయం, సాయంత్రం కేవలం 1 టీస్పూన్ గుల్కంద్ తినడం వల్ల మనస్సు రిఫ్రెష్ అవుతుంది. కోపాన్ని శాంతపరుస్తుంది. ఇది మలబద్ధకం, అజీర్తికి దివ్యౌషధం. ఆకలిని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. గర్భధారణ సమయంలో ఇది చాలా ఉపయోగకరంగా, సురక్షితంగా ఉంటుంది.
 
కంటి చూపును పెంచి, చల్లదనాన్ని అందించడంతో పాటు, కంటి చికాకు, కండ్లకలకలలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. నోటి పూతల, చర్మ సమస్యలకు కూడా గుల్కంద్ వాడకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలసట, శక్తి లేమి విషయంలో కూడా గుల్కంద్ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.