సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2016 (17:30 IST)

కొబ్బరి నీరు తాగండి.. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోండి..

కొబ్బరి బోండాలోని నీళ్ళు చాలా పౌష్టిక గుణాలను కలిగి ఉంటాయి. బలహీనంగా ఉన్న వ్యక్తికి గ్లూకోజ్ దొరకనప్పుడు డ్రిప్స్‌గా కొబ్బరి నీళ్ళను ధారాళంగా వాడతుంటారు. దాహం తీర్చడమే గాక ఇందులో ఉండే మినరల్స్ శరీరాని

కొబ్బరి బోండాలోని నీళ్ళు చాలా పౌష్టిక గుణాలను కలిగి ఉంటాయి. బలహీనంగా ఉన్న వ్యక్తికి గ్లూకోజ్ దొరకనప్పుడు డ్రిప్స్‌గా కొబ్బరి నీళ్ళను ధారాళంగా వాడతుంటారు. దాహం తీర్చడమే గాక ఇందులో ఉండే మినరల్స్ శరీరానికి మేలు చేస్తాయి. అంతేగాకుండా కొబ్బరి నీళ్లలో శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంది. కొబ్బరి నీళ్ళు సేవించడం వల్ల అనేక రోగాలు దరికి రావు.
 
వాత, పిత్త గుణాలను హరింపజేస్తుంది. కొబ్బరి నీరు వేడిని తగ్గిస్తాయి. విరేచనాలను అరికడతాయి. గుండె జబ్బులను తగ్గిస్తాయి. అన్నిటినీ మించి శరీరానికి శక్తిని, బలాన్ని అందిస్తాయి. కొబ్బరికాయలో ఉండే అమూల్యమైన గుణాలు ఎన్నో ఉన్నాయి. ఈ నీళ్ళలో విటమిన్లు, మినరల్సు, ఎలక్ట్రోలైట్స్, ఎంజైమ్‌లు, ఎమినో యాసిడ్లు, సైటోకిన్ అధికంగా ఉన్నాయి. 
 
అందుచేత రోజూవారీగా ఓ కొబ్బరి బొండాంలోని నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే కొబ్బరి నీళ్లను తాగడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరగడంతో వ్యాధులు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.