మంగళవారం, 4 మార్చి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 28 జూన్ 2023 (17:30 IST)

మోతాదుకి మించి పసుపు వాడితే ఏం జరుగుతుందో తెలుసా?

Turmeric, Basil leaves Water
శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో పలు వ్యాధుల చికిత్సకు పసుపును ఉపయోగిస్తున్నారు. పసుపు లేకుండా ఏ వంటకం పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు. అలాంటి పసుపును మోతాదుకి మించి వాడినా, కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు ఉపయోగించినా సమస్యలు వస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు వాడే మందులకు పసుపు సమస్యను తేవచ్చు. ఎందుకంటే ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది.
 
పసుపు కడుపు నొప్పి, వికారం, అతిసారం కలిగించవచ్చు. కొంతమందిలో ఇది అలెర్జీలకు కారణమవుతుంది. మోతాదుకి మించి పసుపు వాడితే మూత్రపిండాలలో రాళ్లు వచ్చే ప్రమాదాన్ని పెంచవచ్చు. అధికంగా పసుపు వాడితే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు. ఇప్పటికే కాలేయ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయినవారు పసుపును అధిక మోతాదులో తీసుకుంటే మరిన్ని సమస్యలు ఎదురవుతాయి.
 
శస్త్రచికిత్సకు కనీసం రెండు వారాల ముందు పసుపు సప్లిమెంట్లను ఉపయోగించడం మానేయడం మంచిది. తక్కువ రక్తపోటుతో బాధపడుతున్నవారు మోతాదుకి మించి పసుపు వాడితే అది ప్రమాదకరమైనది కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది అలెర్జీలకు కారణం కావచ్చు.