గురువారం, 28 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2017 (13:02 IST)

అరగంటైనా ఇంటి పనిచేయండి బాసూ.. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

గంటలు గంటలు కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా? వ్యాయామాల కోసం గంటలు గంటలు వెచ్చిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలిందేమిటంటే.. ఇంటి పనులతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు

గంటలు గంటలు కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా? వ్యాయామాల కోసం గంటలు గంటలు వెచ్చిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలిందేమిటంటే.. ఇంటి పనులతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునట. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. గుండె జబ్బులను దూరం చేసుకోవాలంటే.. గంటల పాటు ఆఫీసుల్లో కూర్చుని పనిచేసినా.. ఇంటికొచ్చి.. ఇంటి పనిచేయాల్సిందేనని ది లాన్సెట్ అనే సైన్స్ జర్నల్‌‌లో ప్రచురితమైన అధ్యయనంలో శాస్త్రవేత్తలు తెలిపారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా 17 దేశాల్లో 1.30 లక్షల మందిపై ఈ అధ్యయనం సాగింది. ఇందులో భారత్‌లోని నాలుగు రాష్ట్రాలు కూడా వున్నాయి. వారానికి 150 నిమిషాల పాటు ఇంటి పనులు చేస్తే ఆరోగ్యంగా వుండొచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంటి పనులంటే.. బట్టలు ఉతకడం, ఇంటిని శుభ్రం చేయడం, గార్డెనింగ్ చేయడం వంటి చిన్న చిన్న పనుల ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చునని అధ్యయనకారులు వెల్లడించారు. 
 
అంతేకాదు.. రోజుకు కనీసం అరగంటైనా ఇంటి పనులు చేయడం ద్వారా ఆయుష్షును పెంచుకోవచ్చును. గుండె జబ్బులను 20 శాతం నివారించవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. దేశంలో సగానికి సగం మందికి సరైన శారీరక శ్రమ లేకపోవడం ద్వారా అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారని.. అరగంటైనా నడవకపోవడం.. మెట్లు ఎక్కకపోవడం.. ఇంటి పనులు చేయకపోవడం వల్ల డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. అందుకే మహిళలు కాదు.. పురుషులు కూడా రోజుకు అరగంటైనా ఇంటి పనుల్లో నిమగ్నమైతే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చినవారవుతామని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు.