శనివారం, 17 జనవరి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2016 (10:27 IST)

ఆకలి భావన అదుపులో ఉండాలంటే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

సాధారణంగా అనేక మంది ఆకలిని తట్టుకోలేరు. నిర్ణీత వేళలకు ఏదో ఒకటి తినకపోతే అలాంటి వారు తట్టుకోలేరు. ఇలాంటి వారు ఆకలిని అదుపులో ఉంచుకోవాలంటే... పోషకాహార మిళితమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆకలిని అదుపులో ఉంచుకోవచ్చని న్యూట్రీషియన్లు చెపుతున్నారు. 
 
ముఖ్యంగా... శరీరంలో అధిక కెలోరీలు చేరకుండా ఉండాలంటే ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినాలి. ఆకలితో పాటు రక్తంలో చక్కెర స్థాయి కూడా సమతూకంలో ఉంటుంది. అందువల్ల అల్పాహారం మితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
అలాగే ఆకలిగా అనిపించి నియంత్రణ లేకుండా తింటుంటే పొట్టనిండిన భావనను కలిగించే పదార్థాలను ఎంచుకోవాలి. పీచు, మాంసకృత్తులు, నీటిశాతం ఎక్కువగా ఉండేవి తీసుకోవచ్చు. కూరగాయలతో చేసే సలాడ్లు, పండ్లు, పండ్లరసాలు, పుచ్చకాయ, జామ వంటివి శరీరానికి తగిన పోషకాలను ఇస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.