ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 10 జూన్ 2023 (19:13 IST)

ఎముకల్లో బలం లేదా? ఇవి తింటే దృఢమైన బోన్స్, ఏంటవి?

Bones
ఎముకలు. కొంతమందిలో ఎముకలు బలహీనంగా వుంటాయి. కాస్తంత బలమైన పనులు చేస్తే కాళ్ల నొప్పులు, చేతులు, వెన్ను నొప్పి అంటుంటారు. దీనికి కారణం ఎముక పుష్టి పెరిగే ఆహారాన్ని తీసుకోకపోవడమే. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయో తెలుసుకుందాము. వాల్ నట్స్‌లో కాల్షియం ఉంటుంది. వీటిని పాలతో కలిపి తింటే మంచిది. సాల్మన్ చేపలను తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
 
కోడిగుడ్లలో ప్రొటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకోవాలి. బచ్చలికూరలో ఐరన్, కాల్షియం, విటమిన్ కె ఉంటాయి కనుక తరచు ఈ ఆకు కూరను తింటుండాలి. ఎర్ర ముల్లంగిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి. పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది కనుక ఎముకల బలానికి తోడ్పడుతాయి.
 
సోయాబీన్‌లో పాలతో సమానమైన కాల్షియం ఉంటుంది. పాలు, సోయాబీన్స్ తర్వాత, అత్యధిక కాల్షియం కంటెంట్ కలిగిన కూరగాయ బ్రోకలీ.