బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 27 జులై 2024 (19:48 IST)

స్వీట్ కార్న్ తింటే ఇవన్నీ ప్రయోజనాలు

స్వీట్‌ కార్న్‌. తీపి మొక్కజొన్నలో విటమిన్ బి, సిలతో పాటు మెగ్నీషియమ్, పొటాషియం ఖనిజాలున్నాయి. స్వీట్ కార్న్ తినడం వల్ల శరీరానికి కీలకమైన పోషకాలు అందుతాయి. వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
అధిక ఫైబర్ కంటెంట్ కలిగిన స్వీట్ కార్న్ తింటే జీర్ణవ్యవస్థతో సహా మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
స్వీట్ కార్న్ తింటుంటే రక్తపోటు తగ్గడమే కాక కొలెస్ట్రాల్‌ను అదుపులో వుంచుంది.
మొక్కజొన్న తింటే మెదడు పనితీరును ప్రోత్సహిస్తుంది, జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది.
గర్భధారణ సమయంలో మహిళలకు ఫోలేట్ మేలు చేస్తుంది. ఇది స్వీట్ కార్న్‌లో వుంది.
రక్తపోటు నియంత్రణకు పొటాషియం అవసరం. ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
పసుపురంగులో ఉన్న స్వీట్‌కార్న్‌లో ఎక్కువగా ఉన్న యాంటీఆక్సిడెంట్స్ కళ్లకు మేలు చేస్తాయి.
మొక్కజొన్న తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించవచ్చు. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
మొక్కజొన్న మరీ ఎక్కువగా తింటే, మలబద్ధకం, కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్, హేమోరాయిడ్లకు కారణం కావచ్చు.