శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్ కుమార్
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2019 (16:01 IST)

క్యాలీఫ్లవర్ జ్యూస్ రోజుకో గ్లాసుడు తాగితే..?

క్యాలీఫ్లవర్‌ని చాలా మంది ఇష్టపడరు. ఇది రుచికరంగా ఉండకపోయినా చాలా పోషక విలువలను కలిగి ఉంటుంది. దీన్ని తినడానికి ఇష్టపడని వారు నచ్చే రీతిలో కూరను తయారు చేసుకుని తినవచ్చు. క్యాలీఫ్లవర్‌ని మసాలా దట్టించి చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. తాజా క్యాలీఫ్లవర్‌ రసాన్ని రోజూ ఒక గ్లాసు చొప్పున మూడు మాసాల పాటు త్రాగితే కడుపులోని పుండ్లు తగ్గిపోతాయి, దంతాలు చిగుళ్ల నుండి రక్తస్రావం తగ్గిపోతుంది. 
 
క్యాలీఫ్లవర్‌ని తీసుకోవడం వల్ల లంగ్‌, బ్రెస్ట్‌, ఒవేరియన్‌, బ్లాడర్‌ క్యాన్సర్‌ వంటి పలు రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. క్యాలీఫ్లవర్‌ ఆకుల రసం రోజూ ఒక కప్పు తాగితే రేచీకటి, చర్మం పొడిపొడిగా ఉండటం, జుట్టు త్వరగా తెల్లబడటం, జలుబు వంటివి రావు. గర్భిణి స్త్రీలు ఈ రసం త్రాగితే పిండం ఆరోగ్యంగా పెరుగుతుంది. 
 
కాలేయం పనితీరును కూడా ఇది క్రమబద్ధం చేస్తుంది. క్యాలీఫ్లవర్‌లో ఉండే గ్లూకోసినోలేట్స్‌, థయోసయనేట్స్‌ లివర్‌ పనితీరును మెరుగుపరచడమే కాకుండా క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందులో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ నుండి రక్షణనిస్తుంది.