సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 మే 2020 (20:31 IST)

కరోనా వేళ.. కూల్ డ్రింక్స్ వద్దు..

కరోనా వేళ కూల్ డ్రింక్స్, ఫ్రిజ్ వాటర్ తాగకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గొంతు తట్టుకునేలా వేడి నీటిని తాగాలంటున్నారు. ఎండలకు కూల్ డ్రింక్స్, ఫ్రిజ్ వాటర్ తాగితే కరోనాను ఆహ్వానించినట్లేనని.. అందుకే గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలంటున్నారు.. వైద్యులు. 
 
కరోనా వైరస్ నోరు, ముక్కు ద్వారా లోపలికి ప్రవేశించాక మూడు రోజుల పాటూ శ్వాస నాళంలోనే ఉంటుంది. శ్వాస మార్గాన్ని మూసేస్తుంది. ఈ మూడు రోజుల సమయంలో వేడి నీరు, టీ, కాఫీ, గ్రీన్ టీ, పసుపు వేసుకున్న వేడి పాల వంటివి తాగితే వాటి కారణంగా వైరస్ పొట్టలోకి వెళ్లిపోతుందని వైద్యులు తెలిపారు.
 
గ్రీన్ టీ తాగడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. గొంతులో మంటగా ఉన్నా, గరగరగా ఉన్నా... గోరు వెచ్చటి పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగితే... ఉపశమనం కలుగుతుంది. అందుకని మరీ వేడిగా నీటిని సేవించకూడదని.. గోరు వెచ్చని నీటితో గొంతు తడుపుకోవాలని వైద్యులు చెప్తున్నారు.