సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 11 జూన్ 2019 (17:30 IST)

డిటర్జెంట్ పౌడర్లతో మొటిమలు వస్తాయా? (video)

డిటర్జెంట్ పౌడర్లతో మొటిమలు వస్తాయా? అంటే అవును అంటున్నారు.. స్కిన్ కేర్ నిపుణులు. డిటర్జెంట్ పౌడర్లను ఎంచుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలి. సువాసనతో కూడిన డిటర్జెంట్లు, రసాయనాలు కలిపిన పౌడర్ల వల్ల అలెర్జీలు తప్పవట.


సున్నితమైన చర్మం కలిగిన వారు డిటర్జెంట్ ఎంపికల్లోనూ శ్రద్ధ అవసరం. అందుకే రసాయనాలు తక్కువగా వున్న డిటర్జెంట్లు, ఆర్గానిక్ డిటర్జెంట్లను ఉపయోగించడం మంచిది. డిటర్జెంట్లు కొనేటప్పుడు ఆ ప్యాక్ వెనుకనున్న రసాయనాలకు సంబంధించిన వివరాలను చదవడం చేయాలి.
 
డిటర్జెంట్‌లలో దుస్తులను శుభ్రం చేశాక బేకింగ్ సోడా లేదంటే వెనిగర్‌లో రెండు నిమిషాలు జాడించి.. ఆరబెట్టడం మంచిది. ఇంకా సోడా, బోరాక్స్ పౌడర్‌తో ఇంట్లోనే డిటర్జెంట్ తయారు చేసుకోవచ్చు.

అలాగే వాషింగ్ మెషీన్‌ను శుభ్రం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. వాషింగ్ మెషీన్‌ను శుభ్రపరచకుండా అలానే సంవత్సరాల పాటు వాడితే చర్మ సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే వాషింగ్ మెషీన్‌ను దుస్తులను ఉతికిన తర్వాత వెనిగర్, సోడాతో శుభ్రపరచడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.