సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 5 అక్టోబరు 2016 (17:21 IST)

నిమ్మరసంతో బ్లీచ్ చేసుకోవడం ఎలా..? తెలుసుకోండి మరి..

నిమ్మరసంలో చర్మ ఛాయను మెరుగుపరిచే బ్లీచింగ్ గుణాలు అధికం. అర చెక్క నిమ్మ రసానికి కొద్దిగా నీళ్లూ, అర చెంచా తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి.

నిమ్మరసంలో చర్మ ఛాయను మెరుగుపరిచే బ్లీచింగ్ గుణాలు అధికం. అర చెక్క నిమ్మ రసానికి కొద్దిగా నీళ్లూ, అర చెంచా తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. 
 
రెండు చెంచాల నిమ్మరసానికి చెంచా తేనె, చెంచా బాదం నూనె కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దీనిని ముఖానికీ, మెడకీ పట్టించి అరాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీనివల్ల తేమతోపాటూ ముఖం నిగారింపు సంతరించుకుంటుంది.
 
మృతకణాలు తొలగించడానికి నిమ్మరసం ఎంతో ఉపయోగపడుతుంది. సగానికి కోసిన నిమ్మచెక్కని పంచదారలో అద్ది, దాంతో ముఖాన్ని సున్నితంగా రుద్దుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో సన్నగా తరిగిన నిమ్మచెక్కతోకానీ, నిమ్మరసంలో ముంచిన దూదితో కానీ రుద్దితే ఫలితం ఉంటుంది. ముఖంపై పేరుకున్న బ్యాక్టీరియా తొలగి యాక్నె వంటి సమస్యలు పోతాయి. ముఖ చర్మమూ మృదువుగా మారుతుంది.