సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By జె
Last Modified: బుధవారం, 4 మార్చి 2020 (22:12 IST)

భార్యాభర్తలు తరచూ గొడవలు, ఆ రోగాలు ఖాయం

కుటుంబం అన్న తరువాత ఏదో ఒక విషయంలో గొడవలు ఉంటాయి. అయితే ఆ గొడవలు పరిష్కరించకుంటే సరిపోతుంది కానీ తెగే దాకా లాగి తరచూ గట్టిగా అరుచుకోవడం.. తరచూ ఘర్షణ వాతావరణం నెలకొనే విధంగా ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా కొన్ని రోగాలను కొని తెచ్చుకున్నట్లేనంటున్నారు వైద్య నిపుణులు.
 
భార్యాభర్తలు కనుక తరచూ గొడవ పడుతుంటే మోకాళ్ళ నొప్పులు, మధుమేహం వంటివి పెరిగే అవకాశం ఉందంటున్నారు. దీన్ని ధృవీకరిస్తోంది అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం. రెండునెలల నుంచి వీరు శోధించి ఈ విషయాన్ని నిర్ధారించారట.
 
అంతేకాదు వైవాహిక జీవితంలోని సంతోషం ఆరోగ్యంపై అనుకూల ప్రభావం చూపుతుందని.. భార్యాభర్తలు ఘర్షణ పడితే మాత్రం కలిగే మానసిక వేదన వల్ల నొప్పులు మరింత ఎక్కువ అవుతాయని అధ్యయనంలో గుర్తించారట.
 
పంతాలు, పట్టింపులకు స్వస్తి చెప్పి ఆనందంగా గడిపితే ఆరోగ్యం బాగుంటుందని..లేకుంటే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుందంటున్నారు. అది కూడా 30 యేళ్ళు దాటిన వారిలోను ఈ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నిర్ధారణకు వచ్చారట.