బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 21 డిశెంబరు 2023 (19:53 IST)

మళ్లీ కరోనా పంజా: రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

coronavirus
మళ్లీ కరోనా వైరస్ పంజా విసురుతోంది. దేశంలో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో శరీర రోగనిరోధక శక్తిని పెంచుకునే ఆహారం తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాము. ఆకు కూరలులో పాలకూర వంటివి తీసుకుంటుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు డ్రై ఫ్రూట్స్, నట్స్ కీలకం. అల్లం, వెల్లుల్లి ఆహారంలో భాగంగా చేసుకుంటుండాలి. పసుపు, మిరియాలు, లవంగాలు, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలు శక్తిని పెంచుతాయి.

పాల ఉత్పత్తులు తీసుకుంటుంటే శరీరానికి పోషకాలు అందడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పుట్టగొడుగులు, మాంసం, చేపలు, కోడిగుడ్లు తింటే రోగనిరోధక వ్యవస్థకు బలాన్ని చేకూర్చుతాయి.