శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్ కుమార్
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2019 (12:58 IST)

మాచా టీ తాగితే ఎంత మేలు చేస్తుందో తెలుసా?

సాధారణంగా ఒత్తిడికి గురైనప్పుడు టీ లేదా కాఫీ తాగుతాం. అప్పుడు మైండ్ ప్రశాంతంగా ఉండటంతో పాటు రిలీఫ్ దక్కుతుంది. అయితే మానసిక సమస్యలు, ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే మాచా టీ తాగాలంటున్నారు శాస్త్రవేత్తలు. జపనీయులు తాగే మాచా టీ తాగితే ఒత్తిడి, ఆందోళన, మనసిక సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చని పరిశోధనల్లో వెల్లడైంది. 
 
సైంటిస్టులు పరిశోధనలో భాగంగా మాచా పౌడర్‌ని ఆందోళన, కంగారుకు గురవుతున్న ఎలుకలపై ప్రయోగించారు. ఈ పౌడర్ తీసుకున్న ఎలుకలు ఆ పరిస్థితి నుంచి బయటపడినట్లు వారు గుర్తించారు.
 
మాచా టీలో ఉంటే ఔషధ కారకాలు మన శరీరంలోని డోపమైన్, సెరటోనిన్ అనే హార్మోన్లను యాక్టివేట్ చేస్తాయట. అందువలనే మాచా టీ తాగిన వెంటనే మనసు రిలాక్స్‌గా అనిపిస్తుంది. మానసిక సమస్యలతో బాధపడేవారు రోజూ ఓ కప్పు మాచా టీ సేవిస్తే మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.