శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 9 మార్చి 2022 (22:52 IST)

నో స్మోకింగ్ డే: పొగతాగడం వల్ల వచ్చే అనారోగ్యాలు ఇవి...

స్మోకింగ్ వల్ల శరీరంలో ప్రతి అవయవంలో సమస్య తలెత్తుతుంది. పొగతాగడం వల్ల కేన్సర్, దీర్ఘకాలికంగా ఇబ్బందిపెట్టే సమస్యలు వదలకుండా వస్తాయి. తల భాగానికి వస్తే తల లేదా గొంతులో కేన్సర్ రావచ్చు. కళ్ల విషయానికి వస్తే అంధత్వం వచ్చే అవకాశం.

 
బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదకర జబ్బుకు ఇదే కారణం కావచ్చు. నోరు చెడిపోతుంది. ఊపిరితిత్తులు సమస్యలు, లంగ్ కేన్సర్ రావచ్చు. గుండెపోటు రావచ్చు. కడుపులో నొప్పితోపాటు న్యూమోనియా కూడా తలెత్తవచ్చు. కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి.

 
కాలేయ సంబంధిత జబ్బులకు అవకాశం. మూత్ర నాళాల్లో ఇబ్బంది తలెత్తవచ్చు. స్త్రీలు, పురుషుల్లోనూ సంతానలేమి సమస్య ఎదుర్కొనవచ్చు. ఇలా శరీరాన్ని పొగ ఉత్పత్తులు నానా హింస పెడతాయి. అందువల్ల పొగతాగడాన్ని మానుకోవడం ఆరోగ్యానికి ఎంతైనా శ్రేయస్కరం.