ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (12:24 IST)

ఆయిల్ పుల్లింగ్‌‌తో ఆరోగ్యం..

Oil pulling
Oil pulling
ఆయిల్ పుల్లింగ్ అనేది ఆయుర్వేద చికిత్స. ఆయిల్ పుల్లింగ్ వల్ల శరీరానికి హాని కలిగించే అన్ని క్రిములు ఉధృతమైన నీటిలో పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఆయిల్ పుల్లింగ్ ద్వారా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, దంత, నోటి వ్యాధులు, కంటి చెవి ముక్కు వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు దూరం అవుతాయి. 
 
ఏ వయసు వారైనా దీన్ని చేయవచ్చు.  ఆయిల్ పుల్లింగ్‌తో దంతాలు తెల్లగా మారుతాయి. అలాగే చిగుళ్లు ఆరోగ్యంగా కనిపిస్తాయి. రోజూ ఆయిల్ పుల్లింగ్ చేస్తుంటే నోటిలోని క్రిములన్నీ నశిస్తాయి.
 
నోటి దుర్వాసన నయమవుతుంది. రోజూ ఆయిల్ పుల్లింగ్ చేస్తుంటే శరీరంలో శక్తి పెరిగి రోజంతా చురుగ్గా ఉంటుంది. మైగ్రేన్‌తో బాధపడేవారు క్రమం తప్పకుండా ఆయిల్ పుల్లింగ్ చేస్తుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.
 
ఉదయం నిద్ర లేవగానే, ఖాళీ కడుపుతో 10 ml స్వచ్ఛమైన నెయ్యి తీసుకుని, దానిని నోటిలో పోసుకుని, 10 నిమిషాల పాటు పుల్లింగ్ చేయాలి. అలా చేయడానికి ముందు, రెండు గ్లాసుల వెచ్చని నీటిని తాగాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.