గోరువెచ్చటి నీటిలో పసుపు వేసి తాగితే ఏమవుతుంది?
పసుపు. ప్రతి కూరలోనూ ఈ పసుపు లేకుండా పూర్తి కాదు. ఆయుర్వేదంలో పసుపు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో వున్నాయి. ఈ పసుపు చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము.
చిటికెడు పసుపును గోరువెచ్చటి నీటిలో కలుపుకుని తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.
పసుపు నీటిని తాగటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరగువుతుంది.
పసుపు నీటిలో యాంటి ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
కడుపులో మంట, చికాకులను తగ్గించుకోవాలంటే పసుపు నీటిని తాగుతుండాలి.
కీళ్ల నొప్పులను తగ్గించుకునేందుకు పసుపు నీటిని తాగుతుంటే ప్రయోజనం వుంటుంది.
పసుపు నీటిని తాగితే కాలేయ సమస్యలు క్రమంగా తగ్గుతాయి.
శరీరంలోని మలిన పదార్థాలను వదలగొట్టడంలో పసుపు బ్రహ్మాండంగా పనిచేస్తుంది.
నిమ్మ, పసుపు, తేనె మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే కాంతివంతంగా వుంటుంది.
గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడిని సంప్రదించాలి.