మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 18 మార్చి 2019 (17:03 IST)

పొట్టు తిసేసిన పల్లీలను తింటున్నారా? అలా చేయకండి..

మనం పల్లీలను అనేక రకాల వంటకాల తయారీలో ఉపయోగిస్తుంటాం. నిత్యం చట్నీలు, కూరలు, స్నాక్స్ రూపంలో వాటిని తింటూనే ఉంటాం. కొంతమంది వాటితో స్వీట్లు చేసుకుని తింటారు. వాటిని ఏ రూపంలో తిన్నా సరే మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి. కానీ కొద్దిమంది మాత్రం పల్లీలను తినేటప్పుడు పొట్టు తీసేసి తింటుంటారు. వాస్తవానికి ఆ పొట్టులోనూ మనకు అవసరమైన పోషకాలు ఉంటాయట. 
 
పల్లీలను పొట్టుతో పాటుగా తినడం వల్ల మనకు చేకూరే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.
* పల్లీలను పొట్టుతో సహా తిన్నట్లయితే, ఆ పొట్టులో ఉండే బయోయాక్టివ్స్, ఫైబర్ జీర్ణ సమస్యలు రాకుండా చేస్తాయి.
* పొట్టుతో సహా పల్లీలను తినడం వల్ల అధిక బరువు కలిగిన వారు కొంతమేర బరువు తగ్గుతారని శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో తేలింది.
 
* పల్లీలను పొట్టుతో పాటుగా తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
 
* శరీరంలో పేరుకుపోయి ఉన్న విష, అలాగే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరాన్ని తేలికగా ఉంచుతాయి.
* వీటిని పొట్టుతో సహా తినడం వల్ల పాలీఫినాల్ అనే రసాయనం చర్మ సమస్యలను పోగొడతాయి. చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి.