శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : గురువారం, 16 మే 2019 (17:55 IST)

పాలకూరతో పోలిస్తే పాప్‌కార్న్‌లో ఏముంది?

పాప్‌కార్న్ అందరికీ ఇష్టమైన స్నాక్, ఇక చిన్న పిల్లలైతే దీన్ని చాలా ఇష్టంగా తింటారు. తినడానికి రుచికరంగా క్రిస్పీగా ఉండే పాప్‌కార్న్‌లో అనేక పోషకాలు ఉన్నాయి. అవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కొన్ని రోగాలు దరిచేరకుండా కాపాడతాయి. పాప్‌కార్న్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. పాప్‌కార్న్ శరీరంలో షుగర్, ఇన్సులిన్ పరిమాణాలను క్రమబద్ధీకరిస్తుంది. 
 
దీనిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్దకం నివారణ అవుతుంది. అధిక బరువు ఉన్నవారు దీన్ని తింటే ఫలితం ఉంటుంది. పాప్‌కార్న్‌లోని విటమిన్స్, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్ వంటి ఖనిజాలు ఎముకల బలానికి చాలా దోహదపడతాయి. 
 
గుండె సంబంధ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. పాలకూరతో పోలిస్తే పాప్‌కార్న్‌లో ఐరన్ శాతం ఎక్కువ. దాని వలన పెద్దప్రేగు క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. రోగనిరోధక శక్తిని ఇది పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ బి3, బి6, ఫోల్లేట్ వంటి ఖనిజాలు శరీరానికి తగిన ఎనర్జీని అందిస్తాయి.