శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 మే 2020 (19:31 IST)

ఎర్రబియ్యం తింటే బానపొట్ట తగ్గిపోతుందట..!

ఎర్రబియ్యంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో ఆక్సిజన్ వేళ్లేందుకు ఐరన్ అవసరం. ఐరన్ తగ్గితే అలసట తప్పదు. వ్యాధినిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే ఎర్ర బియ్యం తినాలని వైద్యులు చెప్తున్నారు. రెడ్ రైస్‌లో క్యాల్షియం, మాంగనీస్ ఉంటాయి. అవి ఎముకల్ని పుష్టిగా, గట్టిగా, బలంగా, పటిష్టంగా మార్చేస్తాయి. అప్పుడు ఎముకలు చిట్లే, పగిలే, బీటలొచ్చే ప్రమాదం ఉండదు. 
 
వృద్ధాప్యంలో అస్థియోపోరోసిస్ వ్యాధి సోకదు. మెనోపాజ్ తర్వాత మహిళలు చాలా బాధ, నొప్పిని అనుభవిస్తారు. వాళ్లు ఎర్ర బియ్యం తింటే ఉపశమనం పొందుతారు. ఆస్తమా నుంచీ రిలీఫ్ పొందేందుకు కూడా ఎర్ర బియ్యం ఉపయోగపడతాయి. తిరిగి నార్మల్‌గా ఊపిరి పీల్చుకునే పరిస్థితి వస్తుంది. ఎర్రబియ్యంలో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో ఒబిసిటీని దూరం చేస్తుంది. 
 
ఎర్రబియ్యం కొద్దిగా తింటేనే పొట్ట నిండిన భావన వుంటుంది. అందుకే ఎర్రబియ్యంతో ఎనర్జీతో పాటు బరువు తగ్గడం సులభం. ఇంకా ఎర్రబియ్యం తీసుకునే వారిలో బాన పొట్టకూడా తగ్గిపోతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించే శక్తి ఎర్రబియ్యానికి ఉంది. 
 
ఎప్పుడైతే చెడు కొవ్వు తగ్గుతుందో గుండెకు రక్త సరఫరా సరిగ్గా సాగుతుంది. అంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎర్రబియ్యంలోని మెగ్నీషియం, బీపీని క్రమబద్ధీకరిస్తుంది. అందువల్ల బీపీ వచ్చేవారికి తరచూ వచ్చే హృద్రోగ వ్యాధులను నివారించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.