శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : గురువారం, 30 మే 2019 (18:05 IST)

గురక పరార్.. ఆవు నెయ్యిని కరిగేలా వేడిచేసి ముక్కు రంధ్రాల్లో..?

గురక చాలా మందిని వేధించే ప్రధాన సమస్య, గురక పెట్టడం వల్ల పక్క వారికి కూడా నిద్రపట్టదు. కోపం, చిరాకు మనపై చూపిస్తారు. గురకకు పలు కారణాలు ఉన్నాయి. నోరు మూసుకుని గురకపెడితే నాలుకలో సమస్య ఉందని అర్థం. నోరు తెరచి గురకపెడితే గొంతులోని మృదువైన కణజాల సమస్యగా గుర్తించాలి. వెల్లకిలా పడుకుని గురకపెడితే ప్రధాన సమస్యగా పరిగణించాలి. 
 
కానీ ఎలా నిద్రించినా గురక వస్తుంటే అది తీవ్ర సమస్య. గురక సమస్య నుండి తప్పించుకోవడానికి ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు ఉన్నాయి. రాత్రి నిద్రపోయే ముందు అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి త్రాగితే మంచి ఫలితం ఉంటుంది. రెండు టీస్పూన్ల పసుపు పొడిని గ్లాసు వేడి పాలలో కలిపి త్రాగినా గురక తగ్గుతుంది. 
 
అలాగే అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌, అర టీ స్పూన్‌ తేనె కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే గురక తగ్గుతుంది. మరిగే నీటిలో నాలుగైదు చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి తలకు ముసుగు పెట్టి రాత్రి నిద్రపోయే ముందు పది నిమిషాల పాటు పీల్చితే గురక తగ్గిపోతుంది. ఆవు నెయ్యిని కరిగేలా కొద్దిగా వేడి చేసి రోజూ రెండు చుక్కల చొప్పున రెండు ముక్కు రంధ్రాలలో వేసి పీల్చితే గురక నుండి ఉపశమనం పొందవచ్చు.