వేసవిలో వచ్చే తలనొప్పులకు అద్భుతమైన పరిష్కారాలు..
సాధారణంగా మనలో చాలా మందికి పని ఒత్తడి కారణంగా తలనొప్పి వస్తుంది. అలాంటిది వేసవిలో ఎండ వేడిమికి బయటికి వెళ్తే తలనొప్పితో పాటు వడదెబ్బ తగులుతుంది. ఈ తలనొప్పి నుండి తప్పించుకోవడానికి చిన్న చిన్న జాగ్రత్తలను పాటిస్తే తలనొప్పి రాకుండా జాగ్రత్త పడవచ్చు. మరి ఆ చిట్కాలు మీరు కూడా ఓ సారి చూసి తెలుసుకోండి.
* ఎండలో తిరగడం వల్ల తలనొప్పి వస్తే..వెంటనే కాసేపు నీడలో సేద తీరాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. దీని వల్ల మనస్సుకు ప్రశాంతత కలిగి..తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
* ఎండలో తిరగాల్సి వస్తే తలపై టోపీ కానీ, టవల్ కానీ కప్పుకోవాలి. వీటి వల్ల ఎండ నేరుగా మన తలకు తగలకుండా ఉంటుంది. దీంతో తలనొప్పి రాకుండా ఉంటుంది.
* రోజుకు తగినంత నీరు తాగకపోయినా తలనొప్పి వస్తుంటుంది. కాబట్టి రోజు తగిన మోతాదులో నీటిని తాగితే తలనొప్పి రాకుండా చూసుకోవచ్చు.
* అరటిపండ్లు, పైనాపిల్, పుచ్చకాయలను తినడం వల్ల కూడా తలనొప్పిని తగ్గించుకోవచ్చు.
* చల్లని కొబ్బరినీళ్లు, మజ్జిగ, ఇతర సహజసిద్ధ పానీయాలను తాగితే తలనొప్పి రాకుండా ఉంటుంది.