శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (16:51 IST)

తమలపాకు ఓకే.. కిళ్లీలు ఎక్కువగా తిన్నారో.. కిడ్నీలో రాళ్లు తప్పవా?

pan masala
తమలపాకులో ఉన్న ఆరోగ్య రహస్యాలు అంతా ఇంతా కాదు. అయితే ఆకులోకి వక్క, సున్నం తో పాటు కాసింత జాజికాయ, పచ్చ కర్పూరం, కుంకుమ పుష్పం, యాలకుల పొడి, కస్తూరి మొదలైనవి వాడతారు. ఇవన్నీ ఆయుర్వేద పరంగా ఆరోగ్యాన్ని చేకూర్చేవి. 
 
ఎముకలను దృఢంగా ఉంచడానికి ఉపయోగపడే కాల్షియం విటమిన్ ఎ, విటమిన్ సి వంటివి సమృద్ధిగా మన శరీరానికి అందుతాయి. తాంబూలం వల్ల జీర్ణవ్యవస్థ సమర్థవంతంగా ఉంటుంది. పాన్ లేదా కిల్లి లను తాంబూలమనే చాలామంది అనుకుంటారు. 
 
అయితే ఇక్కడ గ్రహించాల్సిన విషయం.. పాన్ తయారీలో ఆకు వక్క సున్నం కాకుండా ఇతర పదార్థాలు వాడుతారు. కృత్రిమ రంగులు, కృత్రిమ సువాసనలు జతచేసి, చూడటానికి కళాత్మకంగా చేసినా ఆరోగ్యానికి పాన్​లు అంత మంచివి కాదు. 
 
స్వీట్ పాన్(sweet paan), డ్రై ఫ్రూట్ పాన్, చాక్లెట్ పాన్(chocolate paan) అంటూ రకాలు తీసుకువచ్చినా మన సంప్రదాయమైన తాంబూలం ఇచ్చిన ఫలితాలను మాత్రం ఇవ్వలేవు. రోజుకు 5 నుంచి 10 తమలపాకులను తినే అలవాటు రెండేళ్ల కంటే ఎక్కువ ఉంటే .. డ్రగ్స్ మాదిరిగా వాటికి బానిసలవుతారట. 
 
అలాగే అధిక రక్తపోటు గల వ్యక్తులు కూడా తాంబూలానికి దూరంగా ఉండాలి. తమలపాకు తిన్న తర్వాత పొగ తాగినా లేదా పొగాకును కలిపి తిన్నా సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్ లాంటి ప్రమాదకర నోటి వ్యాధులు వస్తాయి. ఇది నోటి క్యాన్సర్ సంబంధిత సంకేతం. 
 
కాబట్టి .. తమలపాకులను మితంగా తీసుకుంటే ఔషధం, అతిగా తీసుకుంటే విషం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిళ్లీ లేదా పాన్​లు ఎక్కువగా తినేవారికి కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
అందుకు తమలపాకులపై రాసిన సున్నమే (Lime) కారణం కావచ్చంటున్నారు. వక్కలు తినేవారికి దీర్ఘకాల కిడ్నీ జబ్బులు వస్తున్నాయన్నారు. వీరిలో విటమిన్​ డీ స్థాయిలు కూడా పడిపోతూ ఉన్నట్లు చెబుతున్నారు నిపుణులు. 
 
ఇంకా మధుమేహ రోగులైతే వెంటనే పాన్​ మానేయాలని లేకుంటే రోగం ముదురుతుందని సూచిస్తున్నారు. యువతలో బెల్లీ ఫ్యాట్​ కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు.