వ్యాయామం చేసినా ఆ పని చేస్తే అనారోగ్య సమస్యలు తప్పవు
ప్రతిరోజూ ఉదయం లేవగానే అరగంటపాటు వ్యాయామం చేసేవారు ఇకపై తమ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదని అనుకుంటుంటారుగానీ, నిజానికి రోజంతా ఒళ్లు కదల్చకుండా కూర్చోవడం వల్ల కలిగే నష్టాన్ని ఈ అరగంట వ్యాయామాలు ఏమాత్రం భర్తీ చేయలేవని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గంటలతరబడీ అదేపనిగా కూర్చొని పని చేసుకుంటుండేవారు వీలైనప్పుడల్లా సీట్లోంచి లేచి, అటూ ఇటూ తిరగడం.. ఆఫీసు కారిడార్లలో తోటివారితో కొద్దిసేపు పచార్లు చేయడం లాంటివి చాలా మేలు చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఇలా పచార్లు చేయడం వల్ల... ఉదయంపూట వ్యాయామాల కంటే మంచి ఫలితాలను పొందవచ్చునని పరిశోధకులు పేర్కొంటున్నారు. కాబట్టి మితిమీరిన పనిభారంతో ఆఫీసుల్లోనూ, ఇళ్లలోనూ పనిచేసేవారు వీలు చిక్కినప్పుడల్లా లేచి అటూ ఇటూ తిరగడం వల్ల మధుమేహం బారినుంచి తప్పించుకున్నవారవుతారని చెపుతున్నారు.