సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఎంజీ
Last Modified: మంగళవారం, 16 నవంబరు 2021 (23:07 IST)

వయసుతో వచ్చే వ్యాధులు ఇవే... గమనిస్తుంటాం కానీ పట్టించుకోము...

సాధారణంగా మనుషులు తమ 40 సంవత్సరాల వయసు వరకు బాగానే ఉంటారు. నలభయ్యోపడిలో పడ్డారంటే చాలు ఒక్కటొక్కటిగా ఆరోగ్య సమస్యలు వచ్చిపడతాయి. గుండెపోటు, డయాబెటీస్, ప్రొస్టేట్ కేన్సర్ వంటివి సాధారణంగా పురుషులకు వస్తాయి.

మనం కూడా వయసుకు తగ్గట్టుగా వస్తున్నాయిలే అని సరిపెట్టుకుంటూ తగిన చికిత్స పొందుతూ జీవితాల్ని కొనసాగిస్తాం. వయసుకు తగ్గట్టు అలవాట్లు, వాటి ప్రభావాలుగా వ్యాధులు ఎలా వస్తాయో పరిశీలించండి. 20 - 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి, ఆల్కహాల్, డ్రగ్స్, పొగతాగటం, సంతాన విఫలత, మానసిక అసమతుల్యతలు వస్తాయి.
 
40 - 50 సంవత్సరాల మధ్య గుండెజబ్బు, డయాబెటీస్, డిప్రెషన్, పేగు కేన్సర్, మూత్రాశయం, కిడ్నీ వ్యాధులు వస్తాయి. 50 సంవత్సరాల పైన పడితే, పురుషులకు ప్రొస్టేట్ కేన్సర్ లేదా పేగు కేన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. ఈ రకంగా వచ్చే వ్యాధులను మనం ఎదుటివారిలో గమనిస్తూనే వుంటాం కాని మనం తగిన జాగ్రత్తలు తీసుకోము. ఆ వ్యాధులు వచ్చే వరకు ముందస్తు జాగ్రత్తలు పడకుండా వచ్చిన తర్వాత చికిత్సకై చూస్తూంటాము.

కనుక, ఆరోగ్యంపై శ్రధ్ధ పెడుతూ ప్రతి సంవత్సరం పరీక్షలు చేయించుకుంటూ తగిన వైద్య సలహాలు, చికిత్స పొందాలి. తినే ఆహారాలు, శారీరక శ్రమపై కూడా శ్రద్ధ పెట్టాలి. ఏ వ్యాధి అయినప్పటికి ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ రాకుండా చేసుకోవడం తేలిక. వచ్చినప్పటికి మొదటి దశలోనే తెలివైన మానవులుగా తగిన చికిత్సలు ఆచరించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.