మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 29 మే 2019 (10:24 IST)

మీ బ్లడ్ గ్రూప్ 'ఎ' అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

సాధారణంగా మనం హాస్పిటల్స్‌కి వెళ్లినప్పుడు బ్లడ్ గ్రూప్స్ టెస్ట్ చేస్తుంటారు. వైద్యులు అనేక సందర్భాల్లో ఈ టెస్ట్ చేయమని సూచిస్తుంటారు. నిజానికి ఇలా చేయడం వెనుక మన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం కూడా ఉంటుందట. ఏయే బ్లడ్ గ్రూప్‌ల వారికి ఎలాంటి డైట్ ఇవ్వాలి, ఏయే మెడిసిన్స్ తీసుకోవాలని చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఎ బ్లడ్ గ్రూప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 
 
ఎ బ్లడ్ గ్రూప్ గురించి చెప్పాలంటే వీరికి రోగనిరోధక శక్తి కొంచెం బలహీనంగా ఉంటుంది. మధుమేహం, అధిక బరువు సమస్యలు వీరిలో అధికంగా కనిపిస్తుంటాయి. అందుకే వీరు ఎక్కువగా పండ్లు, కూరగాయలు, బీన్స్, చిక్కుడు, శెనగలు, తృణధాన్యాలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. మాంసాహారాన్ని తక్కువగా తీసుకుంటే మంచిది. అదే విధంగా వీరికి అసిడిటీ సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం, ద్రవాహారం తీసుకుంటూ వర్క్‌అవుట్స్ చేయడం మరచిపోకూడదు.