శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 జులై 2020 (13:23 IST)

వంకాయలు ఆరోగ్య ప్రయోజనాలు.. హైబీపీ తగ్గుతుంది

వంకాయల ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వంకాయ తొక్క‌లో ఫైబ‌ర్‌, పొటాషియం, మెగ్నిషియంలు పుష్క‌లంగా ఉంటాయి. దీంతో మ‌న శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. వంకాయ‌ల్లో పాస్ఫ‌ర‌స్‌, ఐర‌న్‌, కాల్షియం, విట‌మిన్ బి1, బి2, బి3, బి6లు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే పోతాయి. అలాగే మూత్రాశ‌య స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. 
 
వంకాయ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి క్యాన్స‌ర్ రాకుండా అడ్డుకుంటాయి. అలాగే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. వంకాయ‌ల్లో ఉండే ఆంథోస‌య‌నిన్స్ గుండె ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షిస్తాయి. 
 
అలాగే వంకాయ‌ల్లో ఉండే నాసునిన్ అనే స‌మ్మేళ‌నం ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. వంకాయ‌ల‌ను రెగ్యుల‌ర్‌గా తింటే హైబీపీ త‌గ్గుతుంది. అలాగే అల్స‌ర్లు ఉన్నా తగ్గిపోతాయి. వంకాయ‌లను త‌ర‌చూ తింటే ర‌క్తంలో ఉండే ట్రై గ్లిజ‌రైడ్లు, ఎల్‌డీఎల్ స్థాయిలు త‌గ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.