సోమవారం, 26 జనవరి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 10 మే 2022 (22:28 IST)

ఎనర్జీ డ్రింక్స్ తాగితే ఏమవుతుంది?

ఎనర్జీ డ్రింక్స్ అనేవి కెఫిన్ జోడించిన పానీయాలు. ఎనర్జీ డ్రింక్స్‌లోని కెఫిన్ పరిమాణం రకరకాలుగా వుంటుంది. కొన్నిసార్లు డ్రింక్స్‌పై ఉన్న లేబుళ్లు వాటిలో కెఫిన్ యొక్క అసలు మొత్తాన్ని చూపించవు. ఎనర్జీ డ్రింక్సులో చక్కెరలు, విటమిన్లు, మూలికలు, సప్లిమెంట్లు కూడా ఉండవచ్చు.

 
ఎనర్జీ డ్రింక్స్ తయారుచేసే కంపెనీలు.... పానీయాలు చురుకుదనాన్ని పెంచుతాయని, శారీరక- మానసిక పనితీరును మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. ఎనర్జీ డ్రింక్స్ తాత్కాలికంగా చురుకుదనాన్ని, శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరుస్తాయని చూపించే పరిమిత డేటా ఉంది. అవి బలాన్ని లేదా శక్తిని పెంచుతాయని చూపించడానికి తగిన ఆధారాలు లేవు. కానీ తెలిసిన విషయమేమిటంటే, ఎనర్జీ డ్రింక్స్ పెద్ద మొత్తంలో కెఫీన్ కలిగి ఉండటం వల్ల అవి ప్రమాదకరం. అవి చాలా చక్కెరను కలిగి ఉన్నందున, బరువు పెరగడానికి- మధుమేహాన్ని మరింత తీవ్రతరం చేయడానికి దోహదం చేస్తాయి.

 
కొన్నిసార్లు యువకులు తమ ఎనర్జీ డ్రింక్స్‌ను ఆల్కహాల్‌తో కలుపుతారు. ఆల్కహాల్- కెఫిన్ కలపడం ప్రమాదకరం. కెఫీన్ ఎంత తాగి ఉన్నారో గుర్తించే సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తుంది, ఇది ఎక్కువగా తాగడానికి దారితీస్తుంది. దీనితో కెఫిన్ ఎక్కువ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఎనర్జీ డ్రింక్స్ అనేవి ఆరోగ్యకరమైనవి కాదని చెపుతారు నిపుణులు.