1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (17:06 IST)

స్త్రీల కంటే పురుషుల ఆయుష్షు బాగా తక్కువ: మగాళ్లు గుండెపోటుతో...?

స్త్రీల కంటే పురుషుల ఆయుష్షు బాగా తక్కువేనని తాజా పరిశోధనలో తేలింది. ఎక్కువ మంది మగాళ్లు గుండెపోటుతో మరణిస్తున్నారని పరిశోధనలు సూచిస్తున్నాయి. కుటుంబం, బయటి బాధ్యతలతో సతమతమయ్యే మగాళ్ల ఆయుష్షు ఆడవాళ్లతో పోలిస్తే తక్కువేనని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు తెలిపారు. పొగతాగడం, మద్యం తీసుకోవడం పురుషుల ఆయువు ప్రమాణంపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. 
 
స్త్రీల కంటే పురుషుల ఆయుష్షు బాగా తక్కువని, ఈ పరిస్థితి ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాదని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పురుషులకు ఆయుష్షు తక్కువేనని వారు స్పష్టం చేశారు. ఎక్కువ మంది మగాళ్లు గుండెపోటుతో మరణిస్తున్నారని పరిశోధనలు సూచిస్తున్నాయి. 
 
19వ శతాబ్ధం తొలి రోజుల వరకు పురుషుల ఆయుష్షు ప్రమాణం కూడా మహిళలకు ధీటుగా ఉండేదని, కాలక్రమంలో 20వ శతాబ్ధం వచ్చే సరికి ఇది తగ్గిపోయిందని వారు పేర్కొన్నారు. మగాళ్ల ఆయుష్షు తగ్గుతున్నప్పటికీ... స్త్రీల ఆయుష్షు అలాగే ఉందని, 13 అభివృద్ధి చెందిన దేశాల్లోని స్త్రీ, పురుషులపై పరిశోధనలు నిర్వహించగా ఈ విషయాలు తెలిశాయని పరిశోధకులు వెల్లడించారు.