ఒక గ్రాము పసుపు ఎంత మేలు చేస్తుందో తెలిస్తే...?
మతిమరుపు ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. బిజీ లైఫ్ పని ఒత్తిళ్ళు కారణంగా మెదడు గతంలో ఉన్న విధంగా చురుకుదనాన్ని కనబరచలేకపోతోంది. దీంతో మరిచిపోవడం సాధారణమైపోయింది. అనారోగ్య సమస్యల్లో మతిమరుపు కూడా చేరిపోయింది. ముఖ్యంగా షార్ట్ టైం మెమరీ లాస్ ఎక్కువవుతోం
మతిమరుపు ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. బిజీ లైఫ్ పని ఒత్తిళ్ళు కారణంగా మెదడు గతంలో ఉన్న విధంగా చురుకుదనాన్ని కనబరచలేకపోతోంది. దీంతో మరిచిపోవడం సాధారణమైపోయింది. అనారోగ్య సమస్యల్లో మతిమరుపు కూడా చేరిపోయింది. ముఖ్యంగా షార్ట్ టైం మెమరీ లాస్ ఎక్కువవుతోంది. ఒక గ్రాము పసుపుతో మతిమరుపుకు స్వస్తి పలుకవచ్చట. ఇదే పరిశోధనలో తేలిందట.
ఒక గ్రాము పసుపుతో షార్ట్ టైం మెమరీ లాస్ నుంచి బయట పడవచ్చు. 60 యేళ్ళ పైబడిన వారిపై ఈ ప్రయోగం చేస్తే వారు బయటపడినట్లు పరిశోధనలో వెల్లడైందట. పసుపులో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయన్నది తెలిసిందే. సాధారణంగా వాడే వంటల్లో తరచుగా పసుపును వాడితే సరిపోతుందట.