అమ్మాయిల్లో పెరిగిన కండోమ్స్ వినియోగం... ఔనా...
దేశంలో కండోమ్‌ల వినియోగం భారీగా పెరిగిపోతోంది. ముఖ్యంగా, అవివాహిత అమ్మాయిల్లోనే వీటి వినియోగం అధికంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
గడిచిన దశాబ్దకాలంగా పెళ్లికాని అమ్మాయిల్లో కండోమ్స్ వినియోగం ఆరురెట్లు పెరిగినట్టు తేలింది. పెళ్లి కాకుండా లైంగిక చర్యల్లో పాల్గొన్న అమ్మాయిలు కండోమ్స్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.
అందుకు కారణాలు కూడా ఉన్నాయని ఆర్థిక సమస్యల వల్ల పెళ్లిళ్లు జరగడంలేదని సర్వేలో తేలింది. కొంతమంది మహిళలు తమకుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో పెళ్లి చేసుకోవడంలేదని అంటున్నారు.
ఇంకొంతమంది సహజీవనానికి, మరికొంతమంది తమ జీవితలక్ష్యాల్ని నెరవేర్చుకునే పనిలో ఉన్నారని, పెళ్లిళ్లు చేసుకుంటే తమ ఆశయాలు మరుగున పడిపోతాయని అందుకే పెళ్లిళ్లు చేసుకోవడంలేదనే విషయాల్ని పలు సంస్థల ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో వెల్లడైంది.
15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు మహిళలు లైంగిక చర్యల్లో పాల్గొంటున్నారు. వీరిలో వివాహం అయిన వారు కుటుంబ నియంత్రణకే మొగ్గుచూపుతున్నారు. 20 నుంచి 24 ఏళ్ల మధ్యవయసు గల పెళ్లి కాని మహిళలు కండోమ్స్ వాడుతున్నారు. 8 మంది మహిళల్లో ప్రతీ ముగ్గురు మహిళలకు కొన్ని అజాగ్రత్తల కారణంగా గర్భం దాల్చుతున్నారు. మహిళల్లో ఎక్కువమంది ఇప్పటికీ సంప్రదాయ కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిస్తున్నారని వైద్యశాఖ సర్వే తేల్చి చెప్పింది.