శనివారం, 16 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 19 ఏప్రియల్ 2017 (03:53 IST)

గాలిని పీల్చకండి... అలా తాగెయ్యండి.. ఊరిస్తున్న కొత్త టెక్నాలజీ

అమెరికాలోని మాసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)కి చెందిన భారత సంతతి పరిశోధకులు ప్రపంచ తాగునీటి సమస్యకు ఒక సులభసాధ్యమైన ప్రక్రియను కనుగొన్నారు. గాలిలోని నీటిని సేకరించడమే కాకుండా దానిని పరిశుభ్రమైన తాగునీటిగా మార్చే సరికొత్త పరికరాన్ని రూ

భూమి అంతర్భాగంలోని జలవనరులు రానురాను కృశించిపోతున్నాయి. సాగునీటికే కాదు తాగునీటికి కూడా జలయుద్ధాలు జరిగే భవిష్యత్తు చిత్రపటం మానవాళిని భయపెడుతోంది. మరి నీటికోసం యుద్ధాలు చేసుకునే పనిని ఏదైనా టెక్నాలజీ తప్పిస్తే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందని చెబుతున్నారు భారత సంతతి పరిశోధకులు. 
 
అమెరికాలోని మాసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)కి చెందిన భారత సంతతి పరిశోధకులు ప్రపంచ తాగునీటి సమస్యకు ఒక సులభసాధ్యమైన ప్రక్రియను కనుగొన్నారు. గాలిలోని నీటిని సేకరించడమే కాకుండా దానిని పరిశుభ్రమైన తాగునీటిగా మార్చే సరికొత్త పరికరాన్ని రూపొందించారు. అయితే ఈ పరికరం సౌరశక్తి ద్వారా పనిచేయడం విశేషం.
 
భూమిపై ఉన్న వాతావరణంలో సుమారు 13,000 ట్రిలియన్‌ లీటర్ల నీరుందట. అంటే ఇది భూమిపై ఉన్న మొత్తం సరస్సుల్లోని నీటిలో 10 శాతమన్నమాట. ఈ గాలిలోని నీటిని ఒడిసిపట్టి పరిశుభ్రమైన నీటిగా మారిస్తే శుభ్రంగా తాగడాన్ని సాధ్యం చేసే ఒక ఆధునిక పరికరంలోని ముఖ్యభాగాన్ని నిట్ లోని భారత సంతతి పరిశోధకులు రూపొందించారు. కేవలం 20 శాతం నీటి ఆవిరి ఉన్న ప్రాంతంలోని గాలి నుంచి కూడా ఇది నీటిని ఒడిసిపడుతుంది నిట్ ప్రొఫెసర్లు చెబుతున్నారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ పరికరాన్ని ఉపయోగించవచ్చని దాని రూపకర్తలు చెబుతున్నారు. 
 
ఈ పరికరం ఉపయోగంలోకి వస్తే వేసవిలో నీటి జాడలేక అల్లాడుతున్న కోట్లమంది ప్రపంచ ప్రజలకు నిజంగా ప్రాణం పోసినట్లే మరి.