మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 26 డిశెంబరు 2020 (10:15 IST)

టమాటా పైపొర జీర్ణం కాదంటారు, ఎందువల్ల?

వృక్షశాస్త్రం ప్రకారం టమాటా కూడా మిర్చి, వంకాయ, ఉమ్మెత్తకాయ కుటుంబమైన సొలనేసీకి చెందినదే. దీని శాస్త్రీయ నామం సొలానమ్‌ లైకోపెర్సికమ్‌. టమాటా పైపొర పలుచని సెల్యులోజ్‌ నిర్మితం.

ఇందులో గట్టిగా కాకున్నా, దృఢంగా ఉండే లైకోపీన్‌ అనే గ్త్లెకోప్రోటీను ఉంటుంది. మన జీర్ణవ్యవస్థ కేవలం తక్కువ సంఖ్యలో మోనోశాకరైడ్లు ఉన్న చక్కెరలను మాత్రమే అరాయించుకోగలవు.

కానీ అధిక సంఖ్యలో చక్కెరలున్న సెల్యులోజ్‌లాంటి పాలీశాకరైడులను జీర్ణం చేయలేదు. టమాటా పండు చర్మం పాలీశాకరైడులు, గ్త్లెకోప్రొటీన్ల వంటి పెద్ద అణువులతో నిర్మితమయినందున అది జీర్ణం కాకుండా అలాగే పీలికలుగా విసర్జితమవుతుంది.