జీతం తగ్గితే ఆరోగ్యానికి హానికరం, ఎన్ని రోగాలు వస్తాయో తెలుసా?

cash
సిహెచ్| Last Modified బుధవారం, 9 అక్టోబరు 2019 (20:20 IST)
జీతం పైన జీవితం ఆధారపడి వున్నదంటూ పరిశోధకులు చెపుతున్నారు. జీతం అలాగే పెరుగుతూ పోవాలి. అంతేకానీ పొరబాటున నెలవారీ జీతం నేల చూపులు చూసిందో ఇక సదరు వ్యక్తి ఆరోగ్యం అనారోగ్యమే. ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయంటున్నారు పరిశోధకులు.

వార్షిక ఆదాయం 25 శాతం లేదా అంతకంటే తక్కువైతే యువతీయువకులు ఆలోచనా సమస్యలతో సతమతమవుతారనీ, ఇది మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు హెచ్చరించారు. అస్థిర ఆదాయాన్ని మెదడు తట్టుకోలేదు. ఈ పరిస్థితి వల్ల డయాబెటిస్ వంటి వ్యాధులతో పాటు ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలకు బానిసవుతారు.

1980ల ఆరంభం నుండి ఆదాయ అస్థిరత రికార్డు స్థాయిలో ఉందనీ, ఇది ఆరోగ్యంపై విస్తృతమైన ప్రభావాలను చూపుతుందనే ఆధారాలు స్పష్టంగా వున్నాయని కొలంబియా మెయిల్‌మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లోని ఎపిడెమియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అన్నారు.దీనిపై మరింత చదవండి :