1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2015 (13:08 IST)

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు... నేటి నుంచి ప్రారంభం..

తల్లి పాల విశిష్టతను తెలిపే రీతిలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగష్టు నెల మొదటి వారం రోజులు తల్లిపాల వారోత్సవాలుగా వాబా (వరల్డ్ అలైన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్షన్ ) సంస్థ పర్యవేక్షణలో డబ్ల్యు.హెచ్.ఓ (WHO), యునిసెఫ్ (UNICEF) మరియు బి.పి.ఎన్.ఐ (BPNI) వంటి అంతర్జాతీయ, జాతీయ సంస్థల అనుబంధంగా జరుపుతున్నారు. 
 
తల్లి పాల సంస్కృతిని ప్రోత్సహించి, సహకరించి, రక్షించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాదికి గాను తల్లిపాల వారోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. పుట్టిన పసి పిల్లలకు శక్తితో పాటు, శారీరక అనారోగ్య సమస్యలు, మానసిక పరమైన సమస్యలను తల్లి పాలు దరిచేరనియ్యవు. పిల్లలకు తల్లిపాలు ఇవ్వకుంటే భవిష్యత్తులో పలు విధాలైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
 
తల్లి బిడ్డకు తన చను పాలు ఇవ్వడం వలన బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతుంది. అంతేకాకుండా తల్లికి కూడా మేలు జరుగుతుంది. బిడ్డ పుట్టినప్పటి నుంచి కనీసం ఆరు నెలల వరకు పసి పిల్లలకు తల్లిపాలను పట్టించడం ఎంతైనా అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలుపుతోంది.