శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : శుక్రవారం, 18 జనవరి 2019 (14:02 IST)

బియ్యం, పెసరపప్పు కలిపి జావగా కాచి..?

పెసలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తరచు వీటిని తీసుకోవడం కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే.. తప్పక పెసలు తీసుకోవాలనిపిస్తుంది. మరి ఆ ప్రయోజనాలేంటో చూద్దాం.. రండి..
 
1. పెసల ఆహారం శరీరానికి మంచి బలాన్ని కండపుష్టిని కలిగిస్తుంది. దీని వలన రక్తక్షీణత, వాత వ్యాధులు, పేగులకు సంబంధించిన ఎన్నో వ్యాధులు నివారిస్తాయి.
 
2. పెసరపప్పుతో, చారుకాస్తేదాన్ని, పెసరకట్టు అంటారు. చింతపండు కలపకుండా పెసరకట్టు చేసుకుని అన్నంలో కలిపి తింటుంటే జీర్ణశక్తిని పెంచుతుంది. ఆకలిని కూడా పెంచుతుంది. జ్వరం వచ్చిన వాళ్ళకి పెసర కట్టు చాలా మంచి ఆహారం. 
 
3. వట్టి పెసర కట్టులో నిమ్మరసం గానీ, దానిమ్మరసం గానీ, టమోటారసం గానీ, ఉసిరికాయరసం గానీ కలిపి త్రాగుతుంటే వాతవ్యాధులన్నీ నివారిస్తాయి.
 
4. పెసరపప్పు ఒక గ్లాస్, బియ్యం నాలుగు గ్లాసులతో అన్నం తయారుచేస్తే దీన్ని పెసర పులగం అంటారు. ఇలా చేసుకుని తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. మొలలు ఉండేవారు రోజూ దీన్ని తినడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. 
 
5. ఇది శరీరానికి బలాన్ని కలిగిస్తుంది. వాత వ్యాధులను నివారిస్తుంది. కడుపులో పుండు, పేగుపూత, కాళ్ళు, కళ్ళు మంటలు ఇవన్నీ తగ్గిపోతాయి. ఇది ఎక్కువగా తింటే అజీర్తి చేస్తుంది. కాబట్టి ఇందులో అల్లం, మిరియాలు, నెయ్యి వంటివి కలిపి తింటే సులువుగా జీర్ణమవుతుంది.
 
6. బియ్యం నాలుగు గ్లాసులు, పెసరపప్పు ఒక గ్లాసు కలిపి జావగా కాచి తాగవచ్చు. జ్వరంతోనున్న వారికి ఇది మంచి ఆహారం.