జామ ఆకుల కషాయం తాగితే?
అధికబరువు సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటివారు జామ ఆకుల టీని తాగితే సమస్య పరిష్కారమవుతుందని చెపుతున్నారు నిపుణులు. అది ఎలాగో తెలుసుకుందాము.
గుప్పెడు జామ ఆకులను కడిగి కొద్దిగా నీటిని మరిగించి అందులో వేయాలి.
ఇలా మరిగించిన ఆకులను చల్లార్చితే జామ ఆకు కషాయం తయారవుతుంది.
జామ ఆకుల టీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించే శక్తి దీనికి ఉంది.
జామ ఆకుల టీ తీసుకునేవారు చాలా సులువుగా బరువు తగ్గుతారు.
జామ ఆకుల టీని తాగితే శ్వాస సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.
జామ ఆకులను శుభ్రంగా కడిగి నమిలి తింటే పంటి నొప్పులు తగ్గుతాయి.