శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 17 అక్టోబరు 2023 (17:05 IST)

ఈ 8 పనులు చేస్తుంటే సింపుల్‌గా బరువు తగ్గవచ్చు

Over weight
అధిక బరువు సమస్యతో ఇటీవలి కాలంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రింది సింపుల్ టిప్స్‌తో ఈ సమస్యను వదిలించుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము. అరటిపండును అల్పాహారంగా తీసుకుంటూ వుండాలి. తింటున్న ఆహారాన్ని బాగా నమిలి తినాలి.

ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరిగా చేస్తూ వుండాలి. ద్రాక్ష, క్రాన్ బెర్రీ రసాలను తాగుతుంటే ఓవర్ వెయిట్ తగ్గవచ్చు. గ్రీన్ టీని తాగుతుంటే కొలెస్ట్రాల్ తగ్గుతూ బరువు కూడా అదుపులోకి తగ్గవచ్చు. మంచినీరు కనీసం 3 లీటర్లకు తగ్గకుండా తాగుతుండాలి. గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తీసుకుంటే బరువు తగ్గవచ్చు.

ప్రతిరోజూ మొలకెత్తిన పెసలు తింటుంటే అధిక బరువు సమస్య వదిలించుకోవచ్చు.