గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : ఆదివారం, 2 జూన్ 2019 (12:22 IST)

మెంతి ఆకులు, మెంతి పిండితో ఎంత మేలో తెలుసా?

మెంతి ఆకులు గుండెకు మేలు చేస్తాయి. ‌మెంతిఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. మెంతి ఆకులను దంచి పేస్ట్‌గా చేసి తలకు రాస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. 
 
జుట్టు మెరిసేందుకు సహాయపడుతుంది ‌కిడ్నీ, మూత్రనాళ సంబంధిత సమస్యలకు మెంతులు చక్కని మందు. రక్తనాళాలను, శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. మెంతికూర రోజూ మన ఆహారంతో పాటు తీసుకుంటే, మన ఆరోగ్యానికి చాలా మంచిది.
 
అలాగే మెంతిపిండి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో చర్మం నల్లగా మారిపోతే.. కొద్దిగా పాలల్లో అరచెంచా మెంతిపిండిని కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. ఆరాక చల్లటి నీళ్లతో కడిగేస్తే మునుపటి ఛాయ వస్తుంది. చెంచా మెంతిపిండిని పుల్లని పెరుగులో కలిపి దాన్ని ముఖానికి రాసి.. అరనిమిషం స్క్రబ్ చేసి ఆపై నీళ్లతో కడిగేసుకుంటే మృదువుగా మారుతుంది.
 
గుప్పెడు మెంతులని రాత్రంతా నానబెట్టి దానికి పుల్లటి పెరుగు, చెంచా నిమ్మరసం, కొద్దిగా ఆలివ్‌నూనె కలిపి పేస్ట్‌లా చేయాలి. దాన్ని తలకు రాసుకుని షవర్‌క్యాప్‌ పెట్టుకోవాలి. ఇలా చేస్తే మాడుకి చల్లదనం అందుతుంది. నిర్జీవంగా మారిన జుట్టు నిగారింపుతో కనిపిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.